CPR,ప్రథమచికిత్స పై అవగాహన సదస్సు

జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఉన్న నాగార్జున డిగ్రీ కాలేజ్( N G COLLEGE ) మరియు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల చర్లపల్లి నల్గొండ నందు విద్యాని విద్యార్థులకు సి పి ఆర్ మరియు ప్రథమ చికిత్సపై రెండవ రోజు JRC&YRC ట్రైనర్ స్టేట్ కోఆర్డినేటర్ రమణ గారిచే నిర్వహించే అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు పాల్గొని అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థిని విద్యార్థులకు గుండెపోటు🫀 నివారణ మరియు ప్రథమ చికిత్సపై 👩‍⚕ అవగాహన సదస్సులను పట్టణంలో ఉన్న వివిధ కాలేజీలో నిర్వహిస్తున్నామని అదేవిధంగా వై ఆర్ సి మరియు జె ఆర్ సి కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని యూత్ రెడ్ క్రాస్ విద్యార్థుల ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలను విస్తృతం చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని కాలేజీ యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తద్వారా విద్యార్థిని విద్యార్థుల కుటుంబ సభ్యులను మరియు పరిసర ప్రాంతాల ప్రజలను ఆపద కాలంలో హాస్పిటల్స్ చేర్పించే లోపు ఆదుకోగలుగుతామని ప్రథమ చికిత్స పై చదువుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో NG కాలేజ్ ప్రిన్సిపల్ గన్ శ్యామ్ గారు రెడ్ క్రాస్ ఎం సి నెంబర్ డాక్టర్ సుచరిత ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్ లెక్చరర్ మునీర్ JRC కోఆర్డినేటర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిప ఎస్.కె సుల్తానా వైస్ ప్రిన్సిపల్ జై పద్మ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ హిమజ డాక్టర్ శోభారాణి కళాశాల విద్యార్థిని విద్యార్థులు రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ రెడ్ క్రాస్ సిబ్బంది సద్దాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related posts