ఎన్నికలలో జరిగే అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టి కి తీసుకువెళ్లడం ప్రతి పౌరుని భాధ్యత.

మునుగోడు నియోజక వర్గం ఎన్నికల సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుగోడులో ఎలక్షన్ వాచ్ కమిటీ అధ్వర్యంలో సోమవారంవిలేకరుల సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్షన్ వాచ్ కమిటి రాష్ట్ర కన్వీనర్ మరియు సమాచార హక్కు పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అద్యక్షులు డాక్టర్.బొమ్మర బోయిన. కేశవులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల మీద ప్రజలందరూ ప్రత్యేక దృష్టి పెట్టారు అని. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకo గా తీసుకోవడంతో ప్రాధాన్యత పెరిగింది. అన్నారు. వివిధ పార్టీల నాయకులు మద్యం డబ్బులు ఇతరతలతో ఓటర్లని ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని ఈ నేపథ్యం లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది అన్నారు జిల్లా అధికార యంత్రాంగం అంతా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అని తెలిపారు ఎన్నికలలో అక్రమాలు నిరోధించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సీ-విజిల్ అప్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్ ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ప్రలోభాలను ఫోటో ద్వారా గాని వీడియో ద్వారా గాని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేయవచ్చ నీ. ఈ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచు, అని చైతన్యవంతులైన ఓటర్లు ఎన్నికలలో జరిగే అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టి కి తీసుకువెళ్లడం ప్రతి పౌరుని భాధ్యత.ఈ యాప్ ద్వారా తెలియచేసిన వారీ యొక్క విషయాలు గోప్యంగా ఉంచబడతాయి అని డా. కేశవులు తెలిపారు. ఈ సంద్భంగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు బండమీది.అంజయ్య గారిని మునుగోడు నియోజక వర్గం ఉప ఎన్నికల ఎలక్షన్ వాచ్ కమిటీ కన్వీనర్ గా నియమించారు. అదే విధంగా వివిధ మండలాల భాధ్యులకు ఎలక్షన్ వాచ్ కమిటీ బాధ్యతలు అప్పగించారు.ఇటీవల అంబేద్కర్ జాతీయ సేవారత్న అవార్డ్ అందుకున్న డా. కేశవుల్ని సమాచార హక్కు పరిరక్షణసమితి మునుగోడు నియోజకవర్గ కమిటీ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చీపురు సతీష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి భాస్కర్ రెడ్డి గారు కాయిత వెంకన్న, దుబ్బ కొండమ్మ, శ్రీనివాసరావు, గాదె ప్రణయ్ కుమార్, సింగం సైదులు, కే.లక్ష్మయ్య, కే. రామలింగం, కొంపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు

Related posts