IMA ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

హైదరాబాద్ కు చెందిన MNJ కాన్సర్ హాస్పిటల్ మరియు నీలగిరి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ఆఫ్ నల్గొండ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ శిబిరాన్ని పట్టణంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు. ఈ స్క్రీనింగ్ లో భాగంగా గర్భాశయము, రొమ్ము, గొంతు, మరియు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను గుర్తించవచ్చునని కావున ఈ కార్యక్రమం ఒక సువర్ణ అవకాశమని శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO వేణుగోపాల్ రెడ్డి, IMA స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డా.ACH పుల్లారావు, MNJ కాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ N.జయలత లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షురాలు సత్య శ్రీ, సెక్రెటరీ సుధామునగాల, ట్రెజరర్ డాక్టర్ జయప్రద రెడ్డి, లైన్స్ ఆఫ్ నల్గొండ గవర్నర్ తీగల మోహన్ రావు, అధ్యక్షులు రామకృష్ణ చిలుకూరి, సెక్రటరీ విద్యాసాగర్ అక్కినేపల్లి అశోక్ ఎర్ర మాద, డాక్టర్ వసంత కుమారి, డాక్టర్ సుచరిత, డాక్టర్ అనిత రాణి, డాక్టర్ రాజేశ్వరి మరియు లయన్స్ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related posts