మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ఏరియల్స్ బకాయిలు చెల్లించాలి- CITU

                      నల్గొండ మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ,డ్వాక్రా కార్మికులందరికీ పిఆర్సి ఏరియర్స్ ,ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం డిమాండ్ చేశారు.

              సోమవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) నలగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ ముసాబు అహ్మద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 2021 జూన్ నుండి పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2022 జూన్ నుండి నల్గొండ మున్సిపాలిటీలో అమలు జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన సంవత్సరం వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగలు, ప్రభుత్వ సెలవులలో కూడా పని చేయించుకుంటూ కార్మికులను కౌన్సిలర్లు వారి బంధువులు, అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులను యంత్రాల్లాగా భావిస్తూ కనీస మర్యాద లేకుండా అసభ్య పదజాలంతో తిడుతూ అవమానిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నలగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా.

               సిఐటియు టౌన్ కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ వివిధ విభాగాలలో పనిచేస్తూ కొత్తగా తీసుకున్న 125 మందికి పిఎఫ్ ESI అమలు చేయాలని, పనిముట్లు ,రెయిన్ కోట్లు ,బట్టలు, చెప్పులు సబ్బులు గ్లోజులు మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాజరు పాయింట్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హాజరు తంబు  రెండుసార్లు మాత్రమే ఉండాలని, ఎనిమిది గంటల పని విధానం ఏకధాటిగా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు పని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో CITU పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, నలగొండ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, ప్రధాన కార్యదర్శి పెరిక కృష్ణ, ఉపాధ్యక్షులు గుండమల్ల శ్రీనివాస్, పెరిక అంజమ్మ , ఏర్పుల శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శులు పందుల లింగయ్య, కత్తుల పద్మ, వంగాల యాదమ్మ మాచర్ల సైదులు ఇస్రము  పాండు, బోప్పని శ్రీనివాస్, కృష్ణవేణి, సాయమ్మ , వెంకన్న , రవి,యల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts