నవోదయ నోటిఫికేషన్-2021-22

నవోదయ విద్యాలయలో 2022 – 23  విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021  నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు 1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 – 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో  వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని ) ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని…

బెస్ట్ అవేలబుల్ స్కీం డ్రా

నల్లగొండ జిల్లాలో చదువుకొనుచున్న ఎస్సీ విద్యార్ధిని /విద్యార్ధుల కొరకు 2021 – 22 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవేలబుల్ స్కీం క్రింద ఇంగ్లీష్ మీడియం 1వ,తరగతి (డేస్కాలర్) మరియు 5వ తరగతి (రెసిడెన్సీయల్) కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది, దీనికి సంబంధించిన  ఎంపిక డ్రా 14 వ తేదీన ఉదయ్ ఆదిత్య భవనము నల్లగొండ నందు ఉదయము 11:00 గంటలకు డ్రా తీయబడును.

ఈ నెల 18 న గురుకుల ప్రవేశ పరీక్ష

తెలంగాణ బీసీ,ఎస్సీ, ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 18 న (TG – CET) నిర్వహిస్తున్నారు,12 వ తేదీ నుండి హాల్ టికెట్లు TG – CET GURUKULA ప్రభుత్య వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ పరీక్ష 18 వ తేదీ ఆదివారము ఉ : 11.00 నుండి 01:00 వరకు ఉంటుంది. హాల్ టికెట్ ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. DOWNLOAD Link : https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/ht/searchHTtgVcet21 Model Question Paper – TGCET-2021