మే డే

మే డే సందర్భంగా నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్గొండ బీట్ మార్కెట్, డీఎంహెచ్వో కార్యాలయంలో టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే ఉత్సవాల్లో పాల్గొని కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ కౌన్సిలర్లు ఊటుకూరు వెంకటరెడ్డి యామా దయాకర్ కార్మిక సంఘం నాయకులు మత్స్యగిరి, గుర్రం వెంకటరెడ్డి ఆచారి,మల్లయ్య, అవుట రవీందర్ బోనగిరి దేవేందర్ రావుల శ్రీనివాస్ రెడ్డి దోనాల నాగార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ఎబివిపిని అడ్డుకోలేరు-ఎబివిపి

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల సమస్యల మీద అనుక్షణం గలమెత్తుతున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కు భయపడి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకుడు పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ అరెస్టులతో మా గొంతును ఆపలేరని నిరంకుశంగా పరిపాలిస్తూ ప్రజల జీవితాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నల్గొండలో అడుగుపెట్టే అర్హత లేదని మండిపడ్డారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ నల్గొండను దత్తత తీసుకుంటా అన్నా దగుల్బాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఈ జిల్లా మొహం చూడకుండా నాగార్జున సాగర్ ఎన్నికల వచ్చే సరికి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రానున్న రోజుల్లో ఏబీవీపీ తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ప్రజల జీవితాన్ని గాలికి…

ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు

-నేలికల్ వద్ద శంకుస్థాపన -లిఫ్టులతో నియోజకవర్గం సస్యశ్యామలం-లిఫ్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్పెద్దఅడిశర్లపల్లి (సామాజిక తెలంగాణ) ఫిబ్రవరి 9నియోజకవర్గానికి ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు కావడం జరిగింది అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం పిఏపల్లి మండలంలోని AKBR లిఫ్టును,పెద్దగట్టు లిఫ్టులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చందంపేట మండలం కంబాలపల్లి లిఫ్టుకు రూ.212.16కోట్లు 8244 ఎకరాలకు సాగు నీరు,నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలనీ వద్ద (అమ్మభావాని లిఫ్ట్) రూ.186.56కోట్లు 13048ఎకరాలకు సాగు నీరు,పిఏపల్లి మండలం పెద్దగట్టు లిఫ్టు రూ.85.31కోట్లు 4100 ఎకరాలకు సాగు నీరు,AKBR లిఫ్టుకు రూ.91కోట్లు, చందంపేట మండలం పొగిళ్ళ లిఫ్టు రూ.25.16కోట్లు 1119 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు…

ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి-పన్నాల

పిఆర్సి రిపోర్టు ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒక లక్షా తొంబై ఒక వెయ్యి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం గెలుపు కోసం నిడమనూరు మండల కేంద్రంలో ప్రచారం చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడినారు ప్రభుత్వ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి ఉపాధ్యాయులకు మాత్రమే ప్రమోషన్స్ ఆపడం విచారకరమని వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగులందరికీ వెంటనే పి ఆర్ సి లో 45 శాతము ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయాలని కోరినారు పట్టభద్రులు అందరూ ఆత్మ అభిమానం చాటుకొని విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు మొదటి ప్రాధాన్యత…

జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్న గువ్వలగుట్ట గ్రామస్తులు

గతంలో నాగార్జున సాగర్ ముంపుకు క్రింద కోల్పోయిన భూమికి బదులుగా హుజూర్ నగర్ నియెజకవర్గం మట్టంపల్లి మండలం గ్రామం పీడవేడు శివారులో గుర్రంపోడు తండాలో రెహాబీటేషన్ సెంటర్ల కింద 1876 ఎకరాల భూమి అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన భూములు మొదటి విడత1970 లో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి D ఫారెస్ట్ చేసి D ఫారం పట్టాలు వంద(100) మందికి ఇవ్వడం జరిగింది 500 ఎకరాలు. రెండో విడత 1983 నుంచి 1987 వరకు ఇవ్వడం జరిగింది 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. మూడో విడత 1993 నుండి 1996 వరకు 1000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇందులో 80 ఎకరాలు ఇళ్ల ప్లాట్ల కొరకు ఇవ్వడం జరిగింది. మొత్తం 1876 ఎకరాలలో 80 ఎకరాలు ఇళ్ల ప్లాట్లు కొరకు తీసివేయగా . 1796 ఎకరాల భూమి…

పెద్దగట్టు లో బాలుడు మృతి

నల్గొండ జిల్లా పీ.ఏ పల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో పాముకాటుతో బాలుడు ధనుష్(4)మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది.గ్రామానికి చెందిన కోనేటి శేఖర్, పార్వతమ్మ దంపతుల కుమారుడు ధనుష్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని,నాగు పాము కాటు వేసింది. ఆదివారం పాముకాటుకు గురైన ధనుష్ నోట్లో నుంచి నురగలు రావడంతో వెంటనే గమనించిన తల్లి తండ్రులు చికిత్స నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు…

పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలి-ఎమ్మెల్యే భాస్కరరావు

ప్రభుత్వ ఉద్యోగులు తాము చేసిన సర్వీసు పూర్తి అయిన అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని మిర్యాల శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు.ఆదివారం రాత్రి స్థానిక లక్ష్మీ కళ్యాణ మండపంలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మిర్యాలగూడ రూరల్ ఏ ఎస్ఐ దశరథ రాజు పదవి విరమణ వీడ్కోలు సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయడంతో పాటు నేరాలను అదుపు చేయడంలో దశరథ రాజు విశేష కృషి చేశారన్నారు.ఎంతటి కేసునైనను సులువుగా ఛేదించగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు.ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పాటు నేరాలు అదుపు చేయడంలోనూ వారి కృషి మరువలేనిదన్నారు.మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ పలు దొంగతనాల కేసులు హత్య కేసులను చేదించే విషయంలో దశరథ రాజు పాత్ర విశేషమన్నారు.భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు…

క్షతగాత్రులకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

పి.ఏ. పల్లి: హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి ఖర్చులు ప్రభుత్వం అందిస్తుందిక్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ క్షతగాత్రులకు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వ్యక్తిగతంగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.ఆదివారం హైదరాబాద్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. నవీన హాస్పిటల్ లో 7గురు,మోహన్ హాస్పిటల్ లో ఒకరు,హెల్త్ కేర్ హాస్పిటల్ లో ఒక్కరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు అయే ఖర్చు మొత్తం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన తెలిపారు. ఎంపీపీ జాన్ యాదవ్ 5000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయన వెంట ఎంపీపీ జాన్ యాదవ్,సర్పంచ్ మల్లేష్,ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు. సేకరణ: విజయ్ కుమార్, పి.ఏ. పల్లి

అభివృద్ధి ని చూసి టి.ఆర్.ఎస్ లో చేరికలు : మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి.

పి.ఏ. పల్లి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారని పి.ఏ.పల్లి మండల మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి అన్నారు పి.ఏ.పల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఏం.ఆర్.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏలేటి నర్సింహ మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ఎల్గురి వల్లప్ రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, టి.ఆర్.ఎస్ నాయకులు రమణంపల్లి వెంకటయ్య,దోసపాటి సాలయ్య,చిలుముల అనిల్, మద్దిమడుగు…

ఓటమి విజయానికి నాంది

పి.ఏ. పల్లి: అంగడిపేట స్టేజీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా యువరాజ్ వారియర్స్ యూత్ అద్వర్యం లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజూ నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ బాలాజీ నగర్ జట్టు విజయఢంకా మోగించి,ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి,ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలలో గెలుపు ఓటములు సహజమని,ఓటమి విజయానికి నాంది అని అన్నారు. క్రిడాకారులు సమయస్ఫూర్తి ప్రదర్శించి భవిష్యత్ లో మంచి పేరు తెచుకోవలన్నారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన బాలజీనాగర్ జట్టుకు రూ.20,116 లు మరియు ట్రోఫీ ని అందించారు. ద్వితీయ బహుమతి సాధించిన యువరాజ్ వారియర్స్ జట్టుకు రూ.15,116 ,ట్రోఫీ ని అందించారు..ఈ…