అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం ఈ రోజు ముకుందపురం లో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ హాజరైనారు, తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగంగా ఆత్మ బలిదానం చేసిన వారి జ్ఞాపకార్ధం లో భాగంగా అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం చేశారు, కార్యక్రమంలో నిడమానూరు ఎంపీపీ బొల్లం జయమ్మ గారు, ,నిడమానూరు AMC చైర్మెన్ కామర్ల జానయ్య గారు, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి గారు, మలిదశ ఉద్యమ కారులు హాలియా మున్సిపల్ కౌన్సిలర్ వర్రా వెంకట్ రెడ్డి గారు,కోప్షన్ మెంబెర్ సలీం గారు, సర్పంచ్ కేశ శంకర్ గారు., మలిదశ .ఉద్యమకారులు trs కొండల్ .తెరాస…

గీత కార్మికుల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.

చండూరు మండలం తెర ట్ పల్లి,గ్రామం లో గీత కార్మికుడు బోయపల్లి పెద్ద మల్లయ్య గారు తడి చెట్టు పై నుండి కింద జారి పడటం జరిగిందిపరామర్శించిన గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం వారిని పరామర్శించి గీత కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతోంది తక్షణమే గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గీత కార్మికుల కూడా నెలసరి జీతం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గీత కార్మికులకు లైసెన్స్ గాని పిఎఫ్ గాని అన్ని పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు శివ కుమార్, గీత కార్మికుడు పబ్బు మారయ్య, బోయపల్లి అంజయ్య, శీను, యాదయ్య, నరసింహ, తదితరులు ఉన్నారు

కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

నల్గోండ జిల్లా పీ.ఏపల్లి మండలం చింతలతండా గ్రామంలో రమావత్ సోమ్లి(55)విద్యుత్‌ వైర్ తగిలి మృతి ఇంట్లో వెలుగులు నింపే కరెంట్ ఒక కుటుంబంలో చీకట్లు నింపింది విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం సకాలంలో స్పందించక పోవటం వల్లనే ఇలా.గత వారం రోజులుగా ఊర్లో ఉన్న ఎనభై ఇండ్లకు ఎర్త్ వస్తుంది ఈ విషయమై విద్యుత్ అధికారులను సర్పంచ్ ను యంపీటీసి తదితరులను సంప్రదించినా పంట్టించుకోకపోవడంతో ఈ రోజు నిండు ప్రాణాన్ని పొట్టన బెట్టుకున్నారు ఎర్త్ వస్తున్నప్పటికీ విద్యుత్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో ఈ గోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సేకరణ:విజయ్ కుమార్, పిఎ పల్లి.

యువత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

గ్రామీణ ప్రాంత యువత క్రికెట్‌తో పాటు ఇతర జాతీయ క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అందుకవసరమైన క్రీడా ప్రాంగణాలను నెల కోల్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం చందంపేట మండల పరిధిలోని పొల్లేపల్లి లో నిర్వహించిన లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గ్రామీణ ప్రాంత యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ లో మొదటి బహుమతి కైవసం చేసుకున్న దేవరకొండ టీంకు, రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు. అలాగే రెండో బహుమతి కొండమల్లెపల్లి టీం కు రూ.10 వేలు,…

రైతన్నకు కరెంట్ ఇబ్బందులు

కరెంటు లేక ఎండిపోతున్నా పంటలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ దేవుడెరుగు.. కనీసం పన్నెండు గంటల పాటైనా త్రిపేస్ కరెంట్ ఇస్తే చాలని రైతన్నలు ఆశిస్తున్నారు. పెద్దగట్టు గ్రామంలో ఎవరిని పలకరించినా ఇదే మాట.రోజుకు రెండు మూడు గంటల కరెంటు అనేక అంతరాయాలతో ఇస్తున్నారు. గంటలోనే పది సార్లు కరెంట్ వచ్చిపోతుంటే.. పంటలు తడవక రైతులు కలత చెందుతున్నారు. ఇక తక్కువ ఓల్టేజ్, తరచూ ఫ్యూజులు పోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వంటి సమస్యలకు తోడు మోటార్లు చెడిపోవడం, స్టార్టర్లు మొరాయించడం వంటి అనేక సమస్యలు కూడా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతున్నాయి. ఏ రైతు పరిస్థితి చూసినా ఇది సర్వ సాధారణమైపోయింది. దీంతో రైతులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పంటలను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. కరెంటు…

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం -మంత్రి జగదీష్ రెడ్డి

-దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్-మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.-సంఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి,మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గార్ల ద్వారా తెలీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి-మూడు లక్షల ఆర్థిక సహాయం తో పాటు అర్హులైన వారికి రెండుపడకల ఇండ్లు,వారి పిల్లలకు ఉచిత విద్య ను అందించనున్నట్లు…

ఘోర ప్రమాదం

నల్గొండ : పీ ఏ పల్లి మండలం నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవే అంగడిపేట స్టేజ్ ఎస్సార్ పెట్రోల్ బంకు దగ్గర ఘోర ప్రమాదం కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఐదుగురు కూలీలు, ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా మహిళలు. మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిది దేవరకొండ మండలం చింతబాయి. ఆటోలో 20మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

MRPS నూతన గ్రామకమిటీల ఎన్నిక

నిడమనూర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూర్ మండలం లో MRPS నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరుగుతుంది. మహాజన సోషలిస్టు పార్టీ (MSP) సాగర్ నియోజకవర్గ అభ్యర్థి విజయవంతానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మందకృష్ణ మాదిగ  గారి ఆదేశాల మేరకు గ్రామాలలో పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. ఇప్పటికే మారుపాక, వెంకటపురం,వెనిగండ్ల,బంకాపురం, వల్లభాపురం, మొదలగు గ్రామాలలో నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరిగిందని  ఒక ప్రకటనలో తెలిపారు బకరం శ్రీనివాస్ మాదిగ. MRPS ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు మరియు నిడమనూర్ మండల ఇంచార్జీ. బొజ్జ చిన్న మాదిగ. MRPS  నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు బొర్ర మోష మాదిగ. MRPS మండల అధికార ప్రతినిధి

వినతిపత్రం

నిడమనూర్ : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మ గూడెం గ్రామానికి చెందిన ముస్లింలకు ప్రభుత్వం కేటాయించిన స్మశాన వాటిక సర్వే నెం:249 స్థలాన్ని కబ్జాలో ఉన్నది కావున ఇట్టి స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ నిడమనూర్ కో అప్షన్ నెంబర్ షేక్ సలీం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది నిడమనూరు మండలం కో ఆప్షన్ నెంబర్ షేక్ సలీం.షేక్ నజీర్.ఎండి బాచి. టిఆర్ఎస్వి నాయకులు నవీన,రాజు,హజరత్,రాము, తదితరులు గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు,