శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మాదకద్రవ్యాలు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించిన డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారం తో శంషాబాద్ లో మాటు వేసిన డీఆర్ఐ అధికారులు. అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం. తమదైన స్టైల్‌ లో  విచారణ చేయగా బయట పడ్డ డ్రగ్స్‌ సరఫరా గుట్టు. నిందితురాలు ముకుంబా కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ అధికారులు.

జిల్లా దావఖానాల్లో 57 పరీక్షలు ఫ్రీ

రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని…

సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ సిద్దం.

రేపు నిర్వహించే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దం అయింది..నల్లగొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గౌడన్స్ లో కౌంటింగ్ కు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు… రెండు హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించనున్నారు…..మెత్తం 25 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తి కానుంది…..ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ప్రకారం కోవిడ్ నిభంధనల్ని కఠినంగా లు చేస్తున్నరు …. కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్స్ లోకి అనుమతి ఇస్తున్నారు….. అథరైజ్డ్ పాసులు ఉన్న వారికి, సిబ్బందికి, అభ్యర్దులకు, ఏజెంట్లకు కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు… నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు…. ఏజెంట్లకు పీపీఈ కిట్లు కూడా అందజేస్తున్నరు….. కౌంటింగ్ కేంద్రాన్ని మెత్తం ప్రతి మూడు…

రాజకీయ లబ్దికోసమే మత విద్వేషాలు

నల్లగొండ : జకీయ లబ్దికోసమే మతవిద్వేషాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి అన్నారునల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వి టి కాలనీలో.. ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నల్గొండలో బిజెపి పార్టీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బిజెపి వారు రాజకీయ లబ్ది కోసం మతాన్ని వాడుకుంటున్నారనిప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారి చర్యలు ఉంటున్నాయనికేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు…

గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

GO MS No 6 ను రద్దు చేయాలి మత్స్యకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ గంగపుత్రుల సంఘం ఆద్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్రుల సంఘం అద్యక్షులు దీటి మల్లయ్య మాట్లాడుతూ గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, చేపలవేట బెస్తలు, గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యతఆని తరువాతే ముదిరాజులకన్న KCR వాగ్ధానాన్ని నిలబెట్టుకోని రెండు కులాల మద్య ఘర్షణ లేకుండా చేయాలన్నారు, గంగపుత్రులకు అడ్డంకిగా ఉన్న GO No 6 ను వెంటనే రద్దు చేయాలని అలాగే వృతి నైపుణ్యత పరీక్షలకు సంబంధించిన GO No 74 ను అమలుపరచాలని  డిమాండ్ చేశారు, తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ గా గంగపుత్రులకు నామినేట్ చేయాలని, మత్స్య పరిశ్రమ…

రైతుల దీక్షకు మద్దతు

హర్యానా రాష్ట్ర బార్డర్లో రైతులకు దీక్ష శిబిరంలో దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలుపుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న కెవిపిఎస్ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ కుమార్

అక్రమ అరెస్ట్ లను ఖండించండి-కామ్రేడ్ బొల్గూరి

రైతాంగం ఆందోళనలకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు పౌరహక్కుల సంఘం, తెలంగాణ శాఖ జగిత్యాల జిల్లాలో పాద యాత్ర ప్లాన్ చేసింది. నిన్న (జనవరి 10) ప్రారంభం కావాల్సిన పాద యాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న ఐదుగురు పౌరహక్కుల సంఘం నాయకులను పోలీసులు మొన్న అరెస్టు చేశారు.మొన్నటి అక్రమ అరెస్టుల గురించి అడగడానికి వెళ్లిన పౌరహక్కుల సంఘం అధ్యక్షులు డా.లక్ష్మణ్, హైకోర్టు న్యాయవాది రఘునాథ్, గుంటి రవి, లింగన్న తదితరులను అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు అరెస్టు చేసి కొడిమ్యాల పోలీసు స్టేషన్లో ఉంచినట్లు సమాచారం. కావునా అక్రమంగా అరెస్ట్ చేసిన పౌర హక్కుల సంఘం నాయకులందరిని వెంటనే భేషరత్తుగా విడుదల చేయాలనీ… ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU (స్టూడెంట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది

పాలకుర్తి ఎస్సైపై గవర్నర్ ప్రశంసలు

వృద్ధురాలికు ఇల్లు కట్టిచ్చినందుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై గారు పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ గారిని ప్రత్యేకంగా రాజ్ భవన్ కి పిలిపించుకుని అభినందించి 80000 రూపాయల చెక్కు రివార్డ్ , ప్రశంస పత్రం రివార్డ్ అందించడం జరిగింది. భవిష్యత్తు లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని తెలిపారు. అన్ని సమయాల్లో సతీష్ కి సపోర్ట్ చేస్తున్న సతీష్ తల్లితండ్రుల పేరు, తెలుసుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

న్యూ ఇయర్ వేడుకలకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రం లో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా లో వచ్చిన కథనాలను చూసి సుమోటో గా విచారించిన హైకోర్టు.. ఒక వైపు  డైరెక్టర్ పబ్లిక్ హెల్త్  కొత్త  వైరస్  మోర్ డేంజర్  అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారన్న హైకోర్టు.. న్యూ ఇయర్ వేడుకలకు పబ్ లు బార్ లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఎం చేయలనుకుంటున్నారన్న హైకోర్టు. రాజస్థాన్, మహారాష్ట్ర లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారన్న హైకోర్టు. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు.. కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపోద్దన్ని ప్రజలకు సూచించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. ప్రభుత్వం ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు. భౌతిక దూరం, మాస్క్ లు తప్పకుండా వినియోగించాలన్న హైకోర్టు.. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి7 న…